Sunday, September 27, 2009

Oscar Classics

Thursday, January 22, 2009

Journalist

మరు జన్మ...
(Taking Life from the Death...!)
ఈ మధ్య కాలం నా కాన్ఫిడెన్స్ ని కుంగదీసింది.
మనసు, శరీరంతో పాటు ఆత్మనే కబళించబోయింది
'కలం'కారుని కదా... కాలానికి లొంగుతానా...
సగటు మనిషిలా కాదు, సరికొత్త శక్తులతో మళ్ళీ పుట్టమని
అమ్మ చెప్పింది, అమ్మలాంటి నా వ్రుత్తి చెప్పింది...
అందుకే (అవార్డు) రెండోసారి నాకు జన్మనిచ్చింది!!
ఇప్పుడు మళ్ళీ పుట్టుకొస్తున్నాను చావునుంచి... !!
(వెన్నుదన్నుగా నిలిచిన మిత్రులకు ధన్యవాదాలు)
AP State Govt. announced Best Electronic Media Journalist award-2006 for Keshav
for details. http://www.hindu.com/2009/01/23/stories/2009012354290500.htm

Saturday, August 2, 2008

Happy Friendship Day SHAM

'శ్యామ్'స్మరణ
వీడికి నవ్వడం తెలుసు...
నవ్వించడం తెలుసు...
వెక్కిరించడం తెలుసు...
విసిగించడం తెలుసు...
కన్నీళ్ళు తెప్పించడం కూడా తెలుసని
మేం తెలుసుకొని అప్పుడే మూడేళ్ళు
క్రైం రిపోర్టర్ కదా
'మస్త్ శవం తెచ్చా హెడ్ లైన్ చెయ్
బుద్ది లేకుండా ఎందుకు చస్తార్రా భాయ్'
ఇదీ వాడి ధోరణి
'ఎవడేమన్నా లైట్ తీస్కొ నచ్చిన పని చెయ్
పక్కనున్న ప్రతివాణ్ణీ కాదు, ఫ్రెండ్ని నమ్ము'
ఇదీ వాడి ఫిలాసఫి...

వాడు దుడుకు మనిషి
నాది కుదురు స్వభావం
నేను ముడుచుకుపోతాను
వాడు విరుచుకుపడతాడు
నేను కనిపించినంత సౌమ్యుడిని కాదు
వాడు వినిపించినంత కఠినుడూ కాదు
మనసు గాయపడితే మాత్రం
ఇద్దరం ఒకేలా స్పందిస్తాం
అందుకే వాడంటే నాకిష్టం

వాడు ఇక లేడని తెలిసినప్పుడు
ఆ దు:ఖం నుంచి తేరుకోడానికి
కనీసం మూడు రోజులు పట్టింది
వాడి జ్ఞాపకాలను వొదులుకోవాలంటే
ఒక జన్మంతా సరిపోదేమో... ఎందుకంటే
వాడు చాలా విలువైన మనిషి
విలువలున్న మనిషి...
కానీ ఎప్పుడో ఒకసారి ఎదురుపడితే
ఏ బుద్ధితో మాకు దూరమయ్యడో అడగాలి
ఏ స్నేహం వాడి మనసుని చిదిమేస్తే
ఇంత పనీ చేశాడో ఆరా తీయాలి...
ఎప్పటినుంచో మనసు తొలుస్తున్న ప్రశ్నలివి!!
(మా 'షేమ్' గాడిని గుర్తుచేసుకున్నందుకు ఆనందంగా...
వాడికి ఏడవటమంటే అస్సలు నచ్చదు కదా...)
-కేశవ్
'శ్యామ్' గురించి తెలుసుకోవాలంటే...

Saturday, June 14, 2008

What I am...!

(శ్రీశ్రీ 25వ వర్ధంతి సందర్భంగా ...
అతని కవిత్వంలా బతకాలని ఆకాంక్షిస్తూ...)

Monday, March 31, 2008

SHE

Tuesday, January 29, 2008

Known to be Unknown!

మొన్న మావూరెళ్ళినప్పుడు అంతా కొత్తగా అనిపించింది... నేను మారడమో వూరు మారడమో తెలీదు కాని, పుట్టి పెరిగిన చోటే పరాయిలా కనిపించింది... అలాంటి పరిస్థితిలోనె ఒకసారి నేను రాసిన కవిత గుర్తుకొచ్చింది. అది మీకు చెప్పాలనిపించింది...

Thursday, January 10, 2008

The Homage